Webdunia - Bharat's app for daily news and videos

Install App

శానిటైజర్ అలా వాడాడు.. సిగరెట్ కాల్చడంతో.. బిగ్గరగా కేకలు వేయడంతో..?

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (16:26 IST)
భారతదేశంలో కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తోంది. దీంతో ఈ వైరస్ నుంచి రక్షించుకోవడానికి ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించడం, శానిటైజేషన్ రాసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం చేస్తున్నారు.
 
కానీ..ఓ వ్యక్తి శానిటేజర్ కారణంగా ప్రమాదంలో పడిపోయాడు. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని లేకపోతే దారుణ ఘటనలు జరుగుతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్ వల్ల అగ్నిప్రమాదం బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
 
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని అశోక్ నగర్‌లో 50 ఏళ్ల రుబన్ నివాసం ఉంటున్నాడు. ఇతను కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత శనివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. వెంటనే హ్యాండ్ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాడు. 
 
ఇలా రాసుకొనే క్రమంలో.. కొంత శానిటైజర్ షర్ట్‌పై పడింది. అతను చూసుకోకుండా..బాత్ రూంకు వెళ్లాడు. అక్కడ సిగరేట్ వెలిగించాడు. సిగరేట్ నుంచి కొంత నిప్పు రవ్వలు వచ్చి షర్ట్ పై పడిపోయాయి. వెంటనే మంటలు చెలరేగాయి. బిగ్గరగా కేకలు వేయడంతో..ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులు స్పందించి మంటలు ఆర్పారు.
 
అనంతరం చికిత్స నిమిత్తం కిల్ పౌక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. ముఖం, మెడ, ఛాతి, పొట్ట, చేతులపై కాలిన గాయాలున్నాయని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments