Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్ టీచరుతో మైనర్ బాలుడు ప్రేమ... ఆ తర్వాత దూరం పెట్టడంతో వినూత్నంగా వేధింపులు...

వరుణ్
గురువారం, 25 జులై 2024 (08:21 IST)
ప్రేమకు వయసుతో పనిలేదు. రెండు మనసులు కలిస్తే చాలని ఓ మైనర్ నిరూపించాడు. తాను చదువుకునే టీచర్‌పై మనసు పారేసుకున్నాడు. అతని ప్రేమకు ఆ టీచరమ్మ కూడా సమ్మతించింది. దీంతో కొంతకాలం పాటు వారిద్దరూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత తాను తప్పు చేస్తున్నానని గ్రహించిన టీచర్... ఆ యువకుడుని దూరంగా పెట్టింది. దీంతో టీచర్‌‍పై కక్ష పెంచుకున్న మైనర్ వినూత్నపద్దతిలో వేధింపులకు పాలపడ్డాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, 17 యేళ్ళ మైనర్ బాలుడు... 22 యేళ్ల మహిళా టీచర్ వద్దకు ప్రతి రోజూ టూషన్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆ టీచర్‌ను మైనర్ బాలుడు ప్రేమించసాగాడు. అతని ప్రేమను గ్రహించిన ఆ టీచర్ కూడా సమ్మతం తెలిపింది. ఇద్దరూ కలిసి ఏకాంతంగా కలుసుకుంటూ వచ్చారు. అయితే, తాను తప్పు చేస్తున్నానని తెలుసుకున్న టీచర్.. ఆ బాలుడిని దూరం పెట్టింది. అప్పటి నుంచి వినూత్న పద్ధతిలో వేధింపులకు పాల్పడసాగాడు.
 
ఆ యువతి పేరిట వాళ్ల ఇంటి చిరునామాకు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్‌లైన్ ఆర్డర్లు, 77 సార్లు ఓలా, ఊబర్ రైడ్స్‌ బుక్ చేసి వేధించాడు. ఆ ఆర్డర్స్‌తో వచ్చేవారికి సమాధానం చెప్పలేక ఆమె కుటుంబం సతమతమైంది. చివరకు ఎవరో గుర్తుతెలియని ఫోన్ నంబరు నుంచి తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ ఈ నెల 2న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ నంబరు, ఈ మెయిల్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి.. రెండు సెల్‌ఫోన్లు, వైఫై రూటర్‌ను సీజ్ చేశారు. ఆ మైనరా బాలుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా... మానసిక ఆరోగ్యం గురించి కౌన్సెలింగ్ చేయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments