Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిపేరు మార్చుకుంటే కులం పేరు మారిపోదు : బాంబే హైకోర్టు

Webdunia
సోమవారం, 30 మే 2016 (11:37 IST)
ఇంటి పేరు మార్చినంత మాత్రాన కులం పేరు మారిపోదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. చెల్లుబాటైన కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించినా తన ఇంటిపేరు మారిందనే కారణంతో వైద్య కళాశాలలో పీజీ సీటు పొందలేకపోయిన విద్యార్థికి బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. ఇంటిపేరు మారినంతమాత్రాన కులం మారిపోదని ఈ నెల 23న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. 
 
శంతను హరి భరద్వాజ్‌ అనే ఎస్టీ విద్యార్థి ఎం.బి.బి.ఎస్‌. పూర్తి చేశాక పీజీ కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంటిపేరు మారిందనే కారణంతో అధికారులు సీటు నిరాకరించారు. తమ ఇంటిపేరును సప్‌కాలే నుంచి భరద్వాజ్‌గా 1999లోనే మార్చుకుని, రాజపత్రంలోనూ ప్రకటించామని విద్యార్థి ఆధారాలు చూపించారు. ఆ ప్రకారం ఇంటి పేరును అధికారికంగా మార్చుకున్నట్లు చెప్పారు. ఇతర అర్హతలు సరిచూసి, విద్యార్థి అభ్యర్థనను పరిగణనలో తీసుకోవాలని సంబంధిత కళాశాలను హైకోర్టు ఆదేశించింది. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments