Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఏసీ ప్రత్యేక రైళ్ల బుకింగులో మార్పులు

Webdunia
శనివారం, 23 మే 2020 (22:39 IST)
జూన్ ఒకటో తేదీ నుంచి 200 రైళ్లు నడిపేందుకు సిద్ధమైన భారతీయ రైల్వే 30 ఏసీ రైళ్లకు సంబంధించి టికెట్ల బుకింగులో కొన్ని మార్పులు చేసింది.

ఇప్పటి వరకు ఏడు రోజులకు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉండగా ఇప్పుడు దానిని 30 రోజులకు పెంచింది. అంతేకాకుండా ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా జారీ చేయనున్నట్టు తెలిపింది.

వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేసినా కన్ఫామ్ కాని వారు ప్రయాణించేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.అలాగే, ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి అరగంట ముందు చార్ట్‌ను విడుదల చేసేవారు.

అయితే, ఇప్పుడు ఈ నిబంధనను కూడా మార్చింది. రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనుంది.

టికెట్లను ఇప్పటి వరకు ఐఆర్‌సీటీసీ, యాప్‌ల ద్వారా మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు రిజర్వేషన్ కౌంటర్లు, పోస్టాఫీసులు, ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్ల నుంచి కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments