మూడు లాంతర్ల స్తంభాన్ని ధ్వంసం చేయడం బాధాకరం: అశోక్ గజపతి రాజు

Webdunia
శనివారం, 23 మే 2020 (22:37 IST)
విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేయడం బాధాకరమని టీడీపీ మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.

ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఆ కట్టడం కూల్చివేత పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న స్థూపాన్ని కూల్చడం ద్వారా జాతీయ చిహ్నాన్ని సైతం అధికారులు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ చర్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో ఇంకా చాలా చారిత్రక కట్టడాలు కూల్చే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు.

దీనిపై విజయనగరం పౌరులతో కలిసి శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతామని అన్నారు. విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న మూడు లాంతర్ల స్తంభం 1860 ప్రాంతంలో ఏర్పాటైనట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

ఇప్పుడీ స్థూపం స్థానంలో కొత్తది నిర్మించాలని అధికారులు ప్రయత్నిస్తుండడం స్థానికంగా ఎంతో అసంతృప్తి కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments