Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని నిమిషాల్లో నిర్దేశిత ప్రాంతానికి విక్రమ్ ల్యాండర్

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (15:19 IST)
చంద్రయాన్-3 ప్రయోగం చివరి దశకు చేరుకుంది. సుధీర్ఘంగా ప్రయాణం చేసిన విక్రమ్ ల్యాండర్ మరికొన్ని గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవాన్ని ముద్దాడనుంది. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా, ఆటోమేటిక్‌ ల్యాండింగ్ సీక్వెన్స్‌ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని, ల్యాండర్ విక్రమ్ నిర్దేశిత ప్రాంతానికి 5.44 గంటలకు చేరుకుంటుందని ఇస్రో ట్వీట్  చేసింది. 
 
అదేసమయానికి ఆటోమేటిక్‌ ల్యాండిగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. సాయంత్రం 5.20 సమయానికి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని వెల్లడించింది. అంతా అనుకున్నట్టుగా సాఫీగా సాగితే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవంపై కాలు మోపుతుందని వెల్లడించింది. కాగా, ఈ ప్రయోగ ప్రక్రియలో చివరి 17 నిమిషాలు చాలా కీలకమని పేర్కొంది. చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అలాగే, ఇస్రో యూట్యూబ్, ఫేస్‌బుక్ పేజీలలో కూడా చూడొచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments