Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రయాన్-3 ప్రాజెక్టు ఘనత ఆయనకే దక్కుతుంది : ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్

Advertiesment
Nehru
, బుధవారం, 23 ఆగస్టు 2023 (12:32 IST)
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టు ఘనత కేవలం ఆయనకే దక్కుతుందని, ఆయనే దేశ తొలి ప్రధానమంత్రి దివగంత జవహర్‌లాల్ నెహ్రూ అని ఛత్తీస్‍గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ తెలిపారు. దేశ తొలి ప్రధానిగా ఆయన ముందుచూపుతో వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ ప్రాజెక్టు సాధ్యమైందని చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశ తొలి ప్రధాని నెహ్రూ చాలా ముందు చూపుతో వ్యవహరించారని పొగడ్తలు కురిపించారు. అంతరిక్ష పరిశోధనల కోసం 1962లో ఆయన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్‌ సీఓఎస్ పీఏఆర్)ను స్థాపించారని గుర్తు చేశారు. అదే ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)గా రూపాంతరం చెందిందని వివరించారు. 
 
భారత అంతరిక్ష పరిశోధనలలో చంద్రయాన్-3 ప్రాజెక్టు గొప్ప విజయమని ఇస్రో శాస్త్రవేత్తలను భూపేశ్ బాఘెల్ అభినందించారు. శాస్త్రవేత్తల కృషితో పాటు ఈ ప్రాజెక్టు వెనుక దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాత్ర కూడా ఉందని చెప్పారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతంగా పూర్తయి, అంతరిక్ష పరిశోధనలలో భారత దేశం చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 
 
కీలక ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్-3 
 
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక ఘట్టానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టనుంది. ఈ అరుదైన క్షణాల కోసం యావత్ భారత ప్రజలతో పాటు ప్రపంచం ఉత్కంఠతగా ఎదురు చూస్తుంది. విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా జాబిల్లిపై అడుగుపెట్టాలని కోట్లాది మంది ఉత్కంఠతతో వీక్షిస్తున్నారు. 
 
రష్యా పంపించిన లూనా 25 స్పేస్ క్రాఫ్ట్‌తో పాటు చంద్రయాన్-2 ప్రాజెక్టు చివరి క్షణంలో విఫలంకావడంతో 'ఆ 20 నిమిషాల'పై దేశవిదేశాల్లోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు. చివరి 20 నిమిషాల టెర్రర్‌ను జయించి విక్రమ్ ల్యాండర్ క్షేమంగా జాబిల్లిని ముద్దాడాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇస్రోకు అభినందనలు, ఆల్ ది బెస్ట్ చెబుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయవంతం కావాలని పూజలు జరుగుతున్నాయి. భారతీయులతో పాటు ప్రపంచ దేశాల చూపు మొత్తం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టుపైనే కేంద్రీకృతమైంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై క్షేమంగా దిగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
2019లో నిర్వహించిన చంద్రయాన్-2 ప్రాజెక్టు వైఫల్యం తర్వాత కారణాలను విశ్లేషించి, అప్పుడు జరిగిన పొరపాట్లకు మళ్లీ తావివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు. ఈసారి ఖచ్చితంగా జాబిల్లిని ముద్దాడి చరిత్ర సృష్టిస్తామన్నారు. సాయంత్రం 5:20 గంటలకు ఇస్రో వెబ్ సైట్‌తో పాటు ఇస్రో యూట్యూబ్ చానెల్, డీడీ నేషనల్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగే అద్భుత క్షణాన్ని చూసేందుకు యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీలక ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్-3 - కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు ఫలించేనా...