Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 5, 8 తరగతుల్లో తప్పనిసరి ఉత్తీర్ణత : కేంద్ర స్పష్టీకరణ

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (10:51 IST)
పాఠశాల విద్యాశాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా, 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది. అయితే, నో డిటెన్షన్ విధాన నిబంధనలను అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల వ్యక్తిగత నిర్ణయని వెల్లడించింది. 
 
ఇప్పటివరకు 5,8 తరగతుల విద్యార్థులకు ఉన్న నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో 5, 8 తరగతుల విద్యార్థులు ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే. లేకపోతే అదే తరగతుల్లో ఉండాల్సి ఉంటుంది. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు రెండు నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో పాస్ అయితేనే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది.
 
ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సుమారు మూడు వేల పాఠశాలల్లో మాత్రమే వర్తించనుంది. వీటిలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి. మరో కీలక విషయం ఏమిటంటే .. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిబంధన అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల వ్యక్తిగత నిర్ణయం అని కేంద్రం పేర్కొనడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకుడు శంకర్‌తో మా జర్నీ అలా మొదలైంది : నిర్మాత దిల్ రాజు

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments