దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కేసు నమోదైంది. 37 యేళ్య వ్యక్తిలో ఈ వైరస్ వెలుగు చూసింది. ఎలాంటి విదేశీ పర్యటనలు లేకపోయినప్పటికీ ఢిల్లీవాసిలో మంకీపాక్స్ వైరస్ పాజిటివ్‌గా రావడాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చాలా సీరియస్‌గా పరిగణిస్తుంది. పైగా, ఈ కేసుతో కలుపుకుంటే దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మంకీపాక్స్ కేసుల తీరుతెన్నులు, దేశంలో మంకీవైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 70కి పైగా ప్రపంచ దేశాల్లో 16 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యయిక పరిస్థితిని ప్రకటించిన విషయం తెల్సిందే.