Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త మీద కోపాన్ని దుత్త మీద కాకుండా.. కన్నకొడుకుపై చూపించింది.. మెట్లపై విసిరేసింది..

అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అనే సామెత అందరికీ గుర్తుండే వుంటుంది. అయితే ఈ కోడలు అత్త మీద కోపం కన్న కొడుకుపై చూపించింది. క్షణికావేశం కన్నకొడుకు పాలిట శాపమైంది. ఎంత కోపమైనా వస్తువులను విసిరేస్తే స

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (13:51 IST)
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అనే సామెత అందరికీ గుర్తుండే వుంటుంది. అయితే ఈ కోడలు అత్త మీద కోపం కన్న కొడుకుపై చూపించింది. క్షణికావేశం కన్నకొడుకు పాలిట శాపమైంది. ఎంత కోపమైనా వస్తువులను విసిరేస్తే సరికానీ బిడ్డను కూడా ఇలా పారేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీకి చెందిన సోనూ గుప్తా(26) తన అత్తతో గొడవపడింది. అనంతరం బెడ్‌పై ఉన్న బట్టలన్నీ చిందరవందర చేసి అదే బెడ్‌పై నిద్రిస్తున్న తన కుమారుడు అన్షూను కూడా తీసుకుని మెట్లపై నుంచి విసిరేసింది. దీంతో ఆ బాలుడి ముఖం, తలకు గాయాలైనాయి. ఈ బాలుడు ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. సోనూగుప్తా భర్త నితిన్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
కాగా... ఆస్తి వ్యవహారాల్లో వచ్చిన తేడాలే ఈ దుశ్చర్యకు కారణమని తెలుస్తోంది. అత్తతో ఏర్పడిన గొడవే ఈ దురాగతానికి దారితీసిందని.. సహనం కోల్పోయిన కోడలు రెండేళ్ల బాలుడిపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా గుప్తా షార్ట్ టెంపరని.. ఆమె మెడికల్ రిపోర్టును పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments