Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవడిలో జంట హత్య.. మూడేళ్ల చిన్నారితో దంపతులు ఎస్కేప్.. ఫోటోలు ఇవే..

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (11:17 IST)
చెన్నై శివారు ప్రాంతమైన ఆవడికి సమీపంలో జంట హత్యకు పాల్పడిన దంపతుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. దంపతులు మూడేళ్ల పిల్లాడితో ఎవరైనా ఇళ్లు అద్దెకు వుందా అంటూ అడిగేందుకు వస్తే.. పోలీసులకు వివరాలివ్వాల్సిందిగా అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆవడి వద్ద జంట హత్యలకు పాల్పడిన దంపతులు, కుమారుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ఫోటోలో చూసిన వారు ఎక్కడైనా కనిపిస్తే 100కు లేదా 9444803562, 94981-06608 అనే నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. మూడేళ్ల బాలుడితో ఇళ్లు అద్దెకు వుందా అంటూ వచ్చే దంపతుల వద్ద జాగ్రత్తగా వుండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 
 
ఆవడి జంట హత్య కేసులో నిందితులైన ఈ దంపతులు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళిపోయి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌ కోసం వచ్చిన ఈ దంపతులు రైల్వే స్టేషన్లో సీసీటీవీ కెమెరాకు చిక్కారని పోలీసులు తెలిపారు. నవంబర్ 27వ తేదీన చెన్నైలో హౌరా ఎక్స్ ప్రెస్ కోసం వెళ్లిన సురేష్ కుమార్, బుహలక్ష్మి దంపతులను చెన్నైలో లేదా ఏపీలో ఎవరూ చూసిన పోలీసులకు తెలియజేయాలని అధికారులు తెలిపారు. చెన్నై-ఏపీ పోలీసులు వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఇకపోతే.. నవంబర్ 27వ తేదీ జగదీశన్ (67), విలాషిని (61) వృద్ధ దంపతులు ఆవడిలోని వారి నివాసంలో హత్యకు గురయ్యారు. వీరిద్దరిని కుమార్ దంపతులు హత్యచేశారని.. జగదీశన్ ఇంట్లో బుహలక్ష్మి పనిచేసేదని పోలీసులు చెప్పారు. 
 
ఆవడిలోని కామరాజర్ నగర్‌లో వుంటూ.. విలాషిని ఇంట్లో బుహలక్ష్మి పనిచేస్తూ వచ్చిందని.. అయితే జగదీశన్ దంపతుల హత్యకు, బుహలక్ష్మి దంపతులకు సంబంధం వుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కుమార్ దంపతులే జగదీశన్‌, విలాషిని దంపతులను హత్య చేసివుంటారని పోలీసులు తేల్చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments