Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ కేసు?.. ఇప్పటికే కుమారుడు అరెస్టు

కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆయన తనయుడు కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్టు చేసింది

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (15:04 IST)
కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆయన తనయుడు కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం చిదంబరంను కూడా సీబీఐ పిలిచే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. 
 
నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కొరకరాని కొయ్యిలా మారిన చిదంబరంపై ఓ కన్నేశారు. దీంతో గత యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా కేసును వెలికి తీశారు. ఈ కేసులో ప్రధాని మోడీ దూకుడు దెబ్బకు చిదంబరం బెంబేలెత్తిపోయారు. తనను, తన కుటుంబ సభ్యులను దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని, వాటిని నిరోధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అది ఇంకా విచారణకే రాలేదు. 
 
ఈ నేపథ్యంలో లండన్‌ నుంచి వచ్చిన కార్తీని బుధవారం ఉదయం చెన్నై విమానాశ్రయంలోనే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను ఢిల్లీకి తీసుకెళ్ళి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం ఒక్కరోజు కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments