హైవే లపై ప్రయాణించే వాహనాలన్నింటికీ కేంద్రప్రభుత్వం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ ఉంటేనే వాహనాలు టోల్ ప్లాజాలు దాటగలుతాయి. ఫాస్టాగ్ లేని వాహనాలను అనుమతించరు.
ఇప్పటి వరకు టోల్‌ప్లాజాల వద్ద ఒకట్రెండు గేట్లను నగదు చెల్లించి వెళ్లేలా ఉంచారు. జనవరి 1 నుంచి ప్రతి వాహనదారుడు విధిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో టోల్‌ప్లాజాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి ఫాస్టాగ్ విక్రయిస్తున్నారు.
ప్రజాప్రతినిధులకు ఉచిత పాస్‌లు
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర గౌరవనీయ పదవుల్లో ఉన్న ప్రముఖులు ఆయా దారుల గుండా వెళ్లేటప్పుడు టోల్‌ప్లాజాల సిబ్బంది టోల్‌గేట్‌లు తెరిచి, వారి వాహనాలు సాఫీగా వెళ్లేలా చూసేవారు. కేంద్రం తాజా నిర్ణయంతో ప్రజాప్రతినిధులకు ఉచిత పాస్‌లు ఇవ్వాలని నాయ్ నిర్ణయించింది.
ఈ పాస్‌లను ఈనెల 31 వరకు జారీ చేయనున్నారు. ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజా ప్రతినిధులకు అప్లికేషన్ ఫాంలతో పాటు లేఖలనూ రాసింది. ఇందు కోసం హైదరాబాద్ లోని రీజనల్ ఆఫీసులో ఓ నోడల్ ఆఫీసర్‌ను కూడా నియమించింది.