Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క పైసా పరిహారం ఇవ్వలేం : సుప్రీంకోర్టు తెలిపిన కేంద్రం

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (16:00 IST)
కరోనా వైరస్ బారినపడి మృత్యువాతపడిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు స్పష్టతనిచ్చింది. పైగా, క‌రోనాతో చ‌నిపోయిన వాళ్లంద‌రి కుటుంబాల‌కు నాలుగేసి ల‌క్ష‌లు ఇస్తే కొవిడ్ స‌హాయ‌క నిధులు స‌రిపోవ‌ని తెలిపింది. 
 
స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు క‌నీస ప్ర‌మాణాలు, చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా కోరుతూ దాఖ‌లైన పిల్‌కు సంబంధించి కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం ప్ర‌కారం భూకంపాలు, వ‌ర‌ద‌లు వంటి ప్ర‌కృతి విప‌త్తుల‌కు మాత్ర‌మే ప‌రిహారం ఉంటుంద‌ని, కొవిడ్ బాధితుల‌కు రూ.4 ల‌క్ష‌లు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని అఫిడ‌విట్‌లో కేంద్రం తేల్చి చెప్పింది.
 
ఇండియాలో క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కూ 4 ల‌క్ష‌ల మంది చ‌నిపోయిన‌ట్లు అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. ఇంత మందికి ఒక్కొక్క‌రికి రూ.4 ల‌క్ష‌లు ఇవ్వాలంటే మొత్తం ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు దీనికే ఖ‌ర్చ‌యిపోతాయి. 
 
మిగ‌తా వాటి కోసం మ‌రింత భారీగా వెచ్చించాల్సి వ‌స్తుంది అని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు కొవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా అత్య‌వ‌స‌ర మందులు, ఇత‌ర కొనుగోళ్ల‌తోపాటు తుఫాన్లు, వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం కూడా క‌ష్ట‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.
 
కొవిడ్ అనేది ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అందువ‌ల్ల ఇత‌ర విప‌త్తుల విష‌యంలో తీసుకునే క‌నీసం స‌హాయ ప్ర‌మాణాలు, ప‌రిహారం ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని కేంద్రం అభిప్రాయ‌ప‌డింది. నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ కింద 2019-20లో కొవిడ్ నియంత్ర‌ణ కోసం రాష్ట్రాల‌కు అద‌నంగా రూ.1113.21 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు కూడా కేంద్రం వెల్ల‌డించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments