పబ్‌లో పరిచయం.. నమ్మి ఇంటికెళితే రేప్... ఎక్కడ?

వారిద్దరూ పబ్‌లో పరిచయమయ్యారు. ఇద్దరూ కలిసి మందు సేవిస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తాజాగా తన ఫ్రెండ్ ఆహ్వానం మేరకు ఇంటికెళితే అతను తనలోని వక్ర

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (16:12 IST)
వారిద్దరూ పబ్‌లో పరిచయమయ్యారు. ఇద్దరూ కలిసి మందు సేవిస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తాజాగా తన ఫ్రెండ్ ఆహ్వానం మేరకు ఇంటికెళితే అతను తనలోని వక్రబుద్ధిని ప్రదర్శించాడు. ఆ యువతిపై అత్యాచారనికి పాల్పడ్డాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కెనడాకు చెందిన ఓ మహిళ మంగళవారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని హాజ్‌ ఖాస్‌ ఏరియాలో ఓ పబ్‌కు వెళ్లారు. అదే పబ్‌కు వచ్చిన అభిషేక్‌ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఫ్రెండ్స్‌గా మారడంతో అడ్రస్‌లు, ఫోన్‌ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. స్నేహితులతో కలిసి బాధితురాలు ఆ రోజు ఇంటికి వెళ్లిపోయారు. 
 
ఆ మరుసటి రోజు నిందితుడు అభిషేక్‌, కెనడా స్నేహితురాలికి ఫోన్‌ చేసి ఇంటికి ఆహ్వానించాడు. ఫ్రెండ్‌ అని అభిషేక్‌ను నమ్మి అతడి ఇంటికి వెళ్లగా.. అదేఅదనుగా భావించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడిబారి నుంచి బయటపడిన ఆ మహిళ నేరుగా ఎయిమ్స్‌ ఆస్పత్రికెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని అక్కడ నుంచే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అభిషేక్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments