పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం: సీఎం పదవికి రాజీనామా

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (13:07 IST)
పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం ముదిరినట్లు సంకేతాలు వస్తున్నాయి. తాజా పరిణామాలతో విసిగిపోయానని సీఎం అమరీందర్‌ సింగ్‌ అధిష్ఠానానికి తెలిపినట్లు సమాచారం. సీఎం పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా గవర్నర్‌కు రాజీనామా లేఖ అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
 
దీంతో ఈరోజు సాయంత్రం పంజాబ్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశమై అమరీందర్‌ వారసుణ్ని ఎన్నుకోనున్నట్లు సమాచారం. గతకొంత కాలంగా అమరీందర్‌, కీలక నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
 
పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ దాదాపు అర్ధరాత్రి సమయంలో చేసిన ట్వీట్‌తో తాజా పరిణామాలకు నాంది పడింది. అత్యవసర శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు.. ప్రతిఒక్కరూ హాజరు కావాలని ఆయన కోరారు. ఆ వెంటనే పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ సైతం ప్రతిఒక్కరూ సమావేశానికి రావాలని ఆదేశించారు. పైకి ఇవన్నీ హఠాత్తుగా జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ.. గత కొంతకాలంగా పార్టీలో అంతర్గతంగా లుకలుకలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments