టీటీవీ దినకరన్‌కు కేబినెట్ హోదా... ఎలాగో తెలుసా? శశికళ తాజా వ్యూహం

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులైన టీటీవీ దినకరన్‌కు కేబినెట్ హోదా దక్కనుంది. అక్రమాస్తుల కేసులో బెంగుళూరు జైలులో ఉన్న శశికళ ఈ మేరకు వ్యూహాన్ని రచించి అమలు చేయనున్నారు.

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (10:29 IST)
అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులైన టీటీవీ దినకరన్‌కు కేబినెట్ హోదా దక్కనుంది. అక్రమాస్తుల కేసులో బెంగుళూరు జైలులో ఉన్న శశికళ ఈ మేరకు వ్యూహాన్ని రచించి అమలు చేయనున్నారు. ఇందులోభాగంగా, కేంద్ర రాష్ట్రాల మధ్య అనుసంధానకర్త (ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి)గా టీటీవీ దినకరన్‌ను నియమించనున్నారు. 
 
నిజానికి శశికళ జైలుకెళ్లిన తర్వాత దినకరన్ పార్టీని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇక ప్రభుత్వ పాలనపై కూడా పట్టు సాధించనున్నారు. ఇందుకోసం కేబినెట్‌ హోదాలో ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించాలని శశికళ ఆదేశించారు. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్ళిన విషయం తెల్సిందే. దీంతో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్‌ను నియమించారు. ఇదిలావుండగా, జైలులో ఉన్న శశికళను మంత్రులు కేఏ సెంగోట్టయ్యన, దిండిగల్‌ శ్రీనివాసన్, కామరాజ్‌, సెల్లూరు కే రాజు కలిశారు. ఆ సమయంలో పలు కీలకాంశాలపై చర్చలు జరిపారు. 
 
ఈ చర్చల్లో భాగంగా ఢిల్లీలో కేంద్ర రాష్ట్రాల మధ్య ప్రత్యేక ప్రతినిధిగా టీటీవీ దినకరన్‌ను నియమించాలన్న ప్రతిపాదన రాగా, దీనికి శశికళ ఆమోదం తెలిపినట్టు సమాచారం. వారు అనుకున్న ప్రకారం అన్ని జరిగితే టీటీవీ దినకరన్‌ను కేబినెట్‌ హోదాలో ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులు కానున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments