Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హెలికాఫ్టర్‌ వల్లే నా గేదె చనిపోయింది... పోలీసులకు రైతు ఫిర్యాదు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (16:06 IST)
అపుడపుడూ వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు చాలా ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వినడానికే కాస్త ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఓ రైతు తన గేదె పోవడానికి ప్రధాన కారణం హెలికాఫ్టరేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లా బహ్‌రోడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ వస్తున్నాడని స్వాగతించండానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా, తమ అభిమాన నాయకుడిపై హెలికాఫ్టర్ ద్వారా పూలవర్షాన్ని సైతం కురిపించారు. అయితే, ఆ హెలికాఫ్టర్ ఆ ప్రాంతంలో పలుమార్లు బహ్‍రోడ్ ప్రాంతంలో చక్కర్లు కొట్టింది. 
 
ఆ తర్వాత కోహ్రానా అనే గ్రామం మీదుగా వెళ్లిపోయింది. ఈ హెలికాఫ్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల పెద్ద శబ్దం వచ్చింది. ఈ హెలికాఫ్టర్ శబ్దానికి రూ.1.5 లక్షల విలువ చేసే తన గేదె మృతి చెందిందని ఆ గ్రామానికి చెందిన బల్వీర్ అనే వృద్ధుడు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. గేదె ఖళేబరాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం సమీపంలోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. ఈ పరీక్ష ద్వారా గేదె ఎలా చనిపోయిందో తెలుస్తుందని, ఆ తర్వాత ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments