Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహార నాణ్యతపై వీడియో పెట్టిన జవాన్ ఏమయ్యాడు? ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు

సోషల్ మీడియాలో సైనిక ఆహార నాణ్యతపై వీడియో పోస్ట్ చేసిన తేజ్ బహదూర్ యాదవ్ అనే సైనికుడు కనిపించట్లేదని ఆయన కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని భార్య ష‌ర్మిల ఇటీవ‌లే మీడియా ముందుకు వ‌చ్చి తన భర్

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (20:44 IST)
సోషల్ మీడియాలో సైనిక ఆహార నాణ్యతపై వీడియో పోస్ట్ చేసిన తేజ్ బహదూర్ యాదవ్ అనే సైనికుడు కనిపించట్లేదని ఆయన కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని భార్య ష‌ర్మిల ఇటీవ‌లే మీడియా ముందుకు వ‌చ్చి తన భర్తను అధికారులు అరెస్ట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. 
 
గురువారం కూడా షర్మిల భర్తపట్ల ఆవేదన వ్యక్తం చేసింది. పలుసార్లు ఫోన్లు చేసినా ఎటువంటి స్పందనా రావడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ప‌లుసార్లు ఫోన్‌ హోల్డ్‌లో పెట్టేస్తున్నారని, మరికొన్ని సార్లు లిఫ్ట్‌ చేసి పక్కన పెట్టేస్తున్నారని జవాను సోదరుడు విజయ్ ఆరోపించాడు. 
 
ఈ నేపథ్యంలో త‌న భ‌ర్త ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పెట్టిన‌ప్ప‌టి నుంచి క‌నిపించ‌డంలేద‌ని జవాను భార్య ఆవేదన వ్యక్తం చేసింది. త‌న భ‌ర్త‌తో కనీసం ఫోన్‌లో అయినా మాట్లాడేందుకు అధికారులు ఒప్పుకోవ‌డం లేద‌ని వాపోయింది.  దీంతో గురువారం ఢిల్లీ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ కింద పిల్‌ను దాఖలు చేశారు. బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కెకె.శర్మకు న్యాయస్థానం లీగల్‌ నోటీసులు పంపించనుంది.

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments