Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాంధుడు, సొంత అన్న చెల్లెలిని గర్భవతిని చేశాడు, మరో ఇద్దరు కూడా కలిసి?

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (18:39 IST)
చెల్లెలని కూడా చూడలేదు. వావివరసలు పూర్తిగా మరిచిపోయాడు. తోడబుట్టిన చెల్లెలిపై అత్యాచారం చేశాడు. గర్భవతిని చేశాడు. అంతటితో ఆగలేదు. తన స్నేహితుడిని అందులో భాగస్వామ్యుడిని చేశాడు. మరో వ్యక్తి కూడా ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా ముగ్గురు కలిసి చివరకు 9వ తరగతి చదువుతున్న బాలికను గర్భవతిని చేశారు.
 
పంజాబ్ లోని చండీగఢ్‌కి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న పదిహేనేళ్ళ బాలిక కడుపు నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. ఆసుపత్రికి తీసుకెళ్ళారు కుటుంబ సభ్యులు. అయితే ఆ బాలిక ఏడు నెలల గర్భవతిగా తేల్చారు వైద్యులు.
 
దీంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. డ్రగ్స్‌కు బానిసైన ఆ బాలిక సోదరుడు ఆమెను కూడా వాటికి బానిసను చేశాడు. ఈ విషయం అన్నకు తెలిసింది. తనే స్వయంగా వాటిని తీసుకొచ్చి ఇచ్చేవాడు. అలా ఆ బాలికకు మాయమాటలు చెప్పాడు. గత డిసెంబర్ నెలలో అత్యాచారం చేశాడు. అలా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేస్తూ వచ్చాడు.
 
అంతటితో ఆగలేదు. తన స్నేహితుడికి విషయం చెప్పాడు. ఇక అతను డ్రగ్స్ తీసుకొచ్చి ఆ బాలికకు ఇవ్వడం మొదలుపెట్టి అతను కూడా బాలికపై అత్యాచారం చేశాడు. వీరిద్దరు బాగోతం తెలిసిన ఇంటి పక్కనే ఉన్న 52 యేళ్ళ వ్యక్తి ఆ బాలికకు మాయమాటలు చెప్పాడు. 
 
ఆమెను లొంగదీసుకున్నాడు. ఇలా ముగ్గురు కలిసి ఆమె జీవితాన్ని నాశనం చేశారు. గత మూడు రోజుల క్రితం బాలిక కడుపునొప్పి అంటే ప్రభుత్వ ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్ళారు. దీంతో బాలిక గర్భవతి అని తేలింది. విషయాన్ని ఆ బాలిక పూసగుచ్చినట్లు తల్లిదండ్రులకు చెప్పింది. 
 
దీంతో ఆమె తల్లిదండ్రులు చైల్డ్ లైన్ ప్రతినిధులకు విషయాన్ని చెప్పడంతో బాలికను వారి సంరక్షణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కౌన్సిలింగ్ ఇస్తున్నారు. బాలికను సొంత అన్నే గర్భవతిని చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా కుమిలిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం