Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ్ముడి కుమార్తెపై బలాత్కారం చేసిన దంత వైద్యుడు... నమస్తే పెట్టలేదని హత్య

Advertiesment
తమ్ముడి కుమార్తెపై బలాత్కారం చేసిన దంత వైద్యుడు... నమస్తే పెట్టలేదని హత్య
, సోమవారం, 7 సెప్టెంబరు 2020 (10:47 IST)
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఓ దంత వైద్యుడు కామాంధుడిగా మారిపోయాడు. సొంత తమ్ముడి కుమార్తెపై బలాత్కారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ ప్రాంతానికి చెందిన ఓ దంతవైద్యుడు తన తమ్ముడి కుమార్తె(21)పై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి బెదిరించి అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు షీటీమ్‌ను ఆశ్రయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
నమస్తే పెట్టలేదనీ... 
ఇదిలావుంటే, నమస్తే పెట్టలేదని ఒకరిని దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. హైదరాబాద్ నగరంలోని రోషన్‌ కాలనీకి చెందిన షేక్‌ జావీద్‌(28)  వంటమనిషిగా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 12:30 గంటల సమయంలో అన్సారీ రోడ్డు ఓవైసీ హిల్స్‌ వద్ద నిలబడి ఉండగా, అటుగా నలుగురు వ్యక్తులు వెళ్తున్నారు. వారిలో ఒకరిని షేక్‌ జావీద్‌ గుర్తు పట్టి నమస్తే పెట్టాడు.
 
ఆ నలుగురిలో ఒకరు నాకు నమస్తే ఎందుకు పెట్టడం లేదంటూ గొడవకు దిగాడు. తన వద్ద ఉన్న కత్తితో జావీద్‌ను విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో జావీద్‌ అక్కడికక్కడే చనిపోయాడు. జావీద్‌కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 
షేక్‌ జావీద్‌ను హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, తాము ఇంకా ఎవరినీ పట్టుకోలేదని పోలీసులు అంటున్నారు. పోలీసుల అదుపులో అజహార్‌, హన్నాన్‌, సయిద్‌, కమ్రాన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండుగ ప్రయాణాలపై కరోనావైరస్ ఎఫెక్ట్, ఇంటి నుండి కదలడానికి ఇష్టపడని ప్రజలు