Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పండుగ ప్రయాణాలపై కరోనావైరస్ ఎఫెక్ట్, ఇంటి నుండి కదలడానికి ఇష్టపడని ప్రజలు

Advertiesment
పండుగ ప్రయాణాలపై కరోనావైరస్ ఎఫెక్ట్, ఇంటి నుండి కదలడానికి ఇష్టపడని ప్రజలు
, సోమవారం, 7 సెప్టెంబరు 2020 (10:43 IST)
కరోనావైరస్ విజృంభణతో ఈసారి పండుగలకు ప్రయాణాలు అంతంతమాత్రమేనని ఓ సర్వే పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి అత్యధిక శాతం మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అతి స్వల్పంగా మాత్రం ప్రయాణాలపై ఆసక్తి చూపుతున్నారు. లోకల్ సర్కిల్స్ అనే ఆన్లైన్ ప్లాట్‌పార్మ్ దేశంలోని 239 జిల్లాలో 25 వేల మంది వద్ద జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
 
రాబోయేది పండుగ సీజన్ కావడంతో ప్రయాణాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకునేందుకు ఈ సర్వేను నిర్వహించింది. కరోనా కారణంగా ఈసారి ప్రజలు ప్రయాణాలపై అంతగా మోజు చూపడం లేదు. 69 శాతం మంది ప్రజలు పండుగలకు తాము ఎక్కడికీ వెళ్లడం లేదని ఇంట్లోనే ఉంటున్నామని తెలపగా 19 శాతం మంది మాత్రమే ప్రయాణాలకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.
 
ప్రయాణాలు చేయాలనుకున్నా వారిలో 23 శాతం మంది విమాన ప్రయాణానికి సిద్దపడగా 38 శాతం మంది కారు లేదంటే క్యాబ్‌లో వెళ్తామని చెప్పారు. 13 శాతం మంది కుటుంబ సభ్యులను, స్నేహితులను కలవడానికి ఇష్టపడగా 3 శాతం మంది విహార యాత్రకు వెళ్తామని చెప్పారు. మరో 3 శాతం మంది మాత్రం రెడింటకీ ప్రాధాన్యం ఇచ్చారు. 12 శాతం మంది మాత్రం ప్రయాణాలు పెట్టుకుంటామా, వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామీణ విలేఖరికి విగ్రహం, ఎవరా విలేకరి? విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేసారు..?