Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళి కట్టాక ప్రియుడితో వధువు జంప్... కేట్‌ కట్ చేసి పార్టీ చేసుకున్న వరుడి ఫ్యామిలీ

కేరళలో ప్రతి ఒక్కరినీ విస్మయపరిచే సంఘటన ఒకటి జరిగింది. ఒక యువతి మెడలో మూడుముళ్లు పడిన తర్వాత ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు కళ్యాణ మండపంలోనే కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చే

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (10:19 IST)
కేరళలో ప్రతి ఒక్కరినీ విస్మయపరిచే సంఘటన ఒకటి జరిగింది. ఒక యువతి మెడలో మూడుముళ్లు పడిన తర్వాత ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.  దీంతో వరుడి కుటుంబ సభ్యులు కళ్యాణ మండపంలోనే కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని గురువాయూరు ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కేరళ రాష్ట్రంలోని కొండుగల్లూరు ప్రాంతానికి చెందిన స్మిత అనే యువతికి అదే ప్రాంతానికి చెందిన సంతోష్‌పై పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఆ ప్రకారంగానే రెండు రోజుల క్రితం ఇరు కుటుంబాల సభ్యులు, బంధువుల సమక్షంలో గురువాయూరు ఆలయంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. సరిగ్గా వధువు మెడలో మూడు ముళ్లు పడిన తర్వాత స్మిత ప్రేమించిన యువకుడు కళ్యాణ వేదిక వద్దకు వచ్చాడు. 
 
తన ప్రియుడిని చూడగానే స్మిత.. పెళ్లి పీటల మీదనుంచి లేచిపోయి ప్రియుడి చేయి పట్టుకుంది. దీంతో ఒక్కసారి అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకుని స్మితను ఆమె ప్రియుడితో వెళ్లేందుకు సమ్మతించారు. అయితే, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేసినందుకు వరుడు కుటుం సభ్యులకు రూ.8 లక్షల పరిహారం చెల్లించేందుకు వధువు తల్లిదండ్రులు సమ్మతించారు. అదేసమయంలో స్మిత ఇచ్చిన జర్క్ నుంచి తేరుకునేందుకు వరుడు, వధువు కుటుంబ సభ్యులు కళ్యాణ్ వేదికపైనే కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments