పూనమ్ పెట్టిన షరతు విని పెళ్లికొడుకు ఆశ్చర్యపోయాడు..

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (16:37 IST)
భారతదేశంలో ఎన్ని చట్టాలు మారినా, ఎంత చదువుకున్నా కట్నం ఇచ్చి అల్లుడిని కొనుక్కునే పరిస్థితి మాత్రం మారలేదు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. హర్యానా రాష్ట్రంలోని బిలావల్ అనే గ్రామానికి చెందిన పూనమ్ అనే అమ్మాయికి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు నిర్ణయించారు. 
 
అమ్మాయి తండ్రి ఓ గవర్నమెంట్ టీచర్. సందీప్ అనే యువకుడితో సంబంధం మాట్లాడుకున్నారు. కాగా స్థానికంగా ఉన్న సంప్రదాయాల ప్రకారం అబ్బాయిలే అమ్మాయికి భరణం కింద కట్నకానుకలు ఇవ్వాలి. ఆ విషయాలు పెద్దవాళ్లు మాట్లాడుకునే సమయంలో పూనమ్ మధ్యలో కల్పించుకుని తన మనస్సులో ఉన్న ఆలోచనను బయటపెట్టింది.
 
మీరు నాకు కట్నం ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు కానీ ఓ పని చేసిపెట్టండి. అది ఏమిటని పెళ్లికొడుకు ఆసక్తిగా అడిగాడు. ఆమె దానికి సమాధానమిస్తూ ఓ 11 మంది బాలికల చదువు బాధ్యత మీరు తీసుకోవాలి. మీరు ఇవ్వాలనుకుంటున్న నగదుని డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీ డబ్బులతో ఆ పిల్లలను చదివించండి.
 
అంతకు మించి నేనేమీ కోరుకోను అని చెప్పే సరికి అత్తారింటివారు కొత్త కోడలు బంగారం అని మెచ్చుకున్నారు. పూనమ్ కూడా తండ్రి బాటలోనే టీచర్‌గా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. పూనమ్ తీసుకున్న నిర్ణయానికి ఊరి ప్రజలంతా సంతోషం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments