Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్ న్యూస్.. స్వాతి హత్య కేసు.. రామ్‌కుమార్ ఆత్మహత్య.. కరెంటు తీగను కొరికి..?

తమిళనాడు రాజధాని చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్యకు గురైన టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడైన రామ్ కుమార్‌ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరెంటు తీగను నోటితో కొరకడంతో రామ్ కుమార్ షాక్ తిని ప్

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (18:31 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్యకు గురైన టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడైన రామ్ కుమార్‌ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరెంటు తీగను నోటితో కొరకడంతో రామ్ కుమార్ షాక్ తిని ప్రాణాలు కోల్పోయాడు. పుళల్ జైలులో ఉన్న రామ్ కుమార్‌ను పోలీసులు వేధింపులకు గురిచేయడంతో ఆతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. 
 
ఇంతకుముందు రామ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన తరుణంలోనూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో హత్యకు గురైన స్వాతి హత్యకేసులో నిందితుడి గుర్తింపులో తీవ్ర కష్టాలు పడ్డ చెన్నై పోలీసులు చివరకు తిరునల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోని మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్ హంతకుడిగా గుర్తించారు. 
 
తాము పట్టుకునే క్రమంలో నిందితుడు గొంతు కోసుకున్నట్టుగా పోలీసులు వాదించడమే కాదు, కేసూ పెట్టారు. నిందితుడు రామ్‌కుమార్ అన్నది తేలినా, సాక్ష్యాల సేకరణకు మరింత కుస్తీలు పడ్డారు. ఈ సమయంలో రామ్‌కుమార్ నిందితుడు కాదు అని, అమాయకుడని, ఎవర్నో రక్షించే యత్నంలో రామ్‌కుమార్‌ను బలిపశువు చేశారన్న ఆరోపణలు బయలు దేరాయి. ఈ నేపథ్యంలో రామ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం తమిళనాట చర్చనీయాంశమైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments