Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలాఖ్.. తలాఖ్…తలాఖ్.. ముస్లిం మహిళలకు గుడ్ న్యూస్..?!

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (18:05 IST)
తలాఖ్.. తలాఖ్…తలాఖ్ అనే మూడు ముక్కలు పురుషులేంటి..? ఇక మహిళలు కూడా చెప్పేయవచ్చునని ముస్లిం మహిళలకు కేరళ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ముస్లిం పురుషులు మూడు సార్లు తలాఖ్ చెప్పేసినా.. ముస్లిం మహిళలు పట్టించుకోనక్కర్లేదు. 
 
తలాఖ్ చెప్పే హక్కు ముస్లిం మహిళలకు కూడా ఉందని తీర్పునిచ్చింది కేరళ హైకోర్టు. విడాకులు తీసుకోవాలనుకునే మహిళలు కోర్టుకు రావాల్సిన పనిలేదని.. కోర్టు బయటే 'నాలుగు పద్ధతుల్లో' విడాకులు తీసుకోవచ్చునని తీర్పునిచ్చింది.
 
ముస్లిం మహిళలూ కోర్టుకు రావాల్సిన పనిలేకుండానే ఇస్లాం చట్టాల ప్రకారం విడాకులు తీసుకోవచ్చని తీర్పు చెప్పింది. ఫ్యామిలీ కోర్టుల్లో పరిష్కారం కాని వివిధ కేసుల విచారణ చేస్తున్న సందర్భంగా ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. కోర్టుకు రాకుండా విడాకులు తీసుకునే హక్కు ముస్లిం మహిళలకు లేదని 1972లో 'కేసీ మోయిన్ వర్సెస్ నఫీసా తదితరులు' కేసులో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
 
ఈ సందర్భంగా జస్టిస్ ఎ. మహ్మద్ ముస్తాఖ్, జస్టిస్ సీఎస్ దియాస్ ల ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లింలకు పరమ పవిత్రమైన ఖురాన్ ముస్లిం పురుషులు, మహిళలకు విడాకులు తీసుకునే విషయంలో సమాన హక్కులను కల్పించిందని తెలిపింది. 
 
షరియా చట్టం పరిరక్షణలోని ఇస్లాం చట్టాలు గుర్తించిన తలాఖ్ ఈ తాఫీజ్, ఖులా, ముబారాత్, ఫస్క్ అనే నాలుగు పద్ధతుల విడాకులను ప్రస్తావించింది ధర్మాసనం. వాటిలోని మూడు పద్ధతుల ప్రకారం ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చని తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

దళపతి విజయ్ కి గ్రాండ్ వీడ్కోలు పలికే ప్రత్యేక పాట !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments