Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్గనైజర్ చెప్పేవన్నీ అబద్ధాలే... కోర్టులో సన్నీ లియోన్ ఊరట

ఆర్గనైజర్ చెప్పేవన్నీ అబద్ధాలే... కోర్టులో సన్నీ లియోన్ ఊరట
, బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (14:51 IST)
బాలీవుడ్ నటిగా మారిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఓ ఈవెంట్ ఆర్గనైజర్ మోసగత్తెగా ప్రచారం చేయడాన్ని ఆమె ఖండించారు. ఇదే అంశంపై తనపై దాఖలైన కేసు వ్యవహారంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా, ఆమెను అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు జారీచేసింది. 
 
కేరళ పెరంబవూర్‌కు చెందిన ఆర్‌.షియాన్ చెందిన వ్యక్తి సన్నీ తనను మోసం చేసింద‌ని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పి రూ.29లక్షలు తీసుకొని.. ముఖం చాటేసిందని ఆరోపించాడు. దీంతో కేసు నమోదు చేసిన ఆ రాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులు... ఇటీవ‌ల తిరువ‌నంత‌పురంలో టీవీ షో కోస‌మ‌ని స‌న్నీ లియోన్‌ వద్ద విచారణ జరిపి వాంగ్మూలం రికార్డు చేశారు. 
 
ఆర్గనైజర్‌ అన్నీ అబద్ధాలు చెబుతున్నాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పింది. షెడ్యూల్ స‌రిగా ఫిక్స్ చేయ‌కుండా ప‌లుమార్లు మార్చాడు. తనకు రావాల్సిన డబ్బును కూడా సకాలంలో చెల్లించలేదని ఆరోపించింది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో మేం రాత్రిబ‌వ‌ళ్లు షూటింగ్ చేస్తున్నాం. జీవితాలు రిస్క్ చేస్తూ ఇండ‌స్ట్రీకు మళ్లీ పాత రోజులు వ‌చ్చేలా చేస్తున్నాం. ఇలాంటి స‌మ‌యంలో ఓ ఈవెంట్ మేనేజ‌ర్ ఇలాంటి దారుణ‌మైన మాట‌లు న‌న్ను ఎంత‌గానో బాధించాయి. దీనిపై నేను అధికారుల‌కు స్టేట్‌మెంట్ ఇచ్చాను. 
 
చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంది అని సన్నీ పేర్కొంది. అయినప్పటకీ ఆమె ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు సన్నీ లియోన్‌ను అరెస్టు చేయొద్దంటూ పేర్కొంటూ ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రీతు వ‌ర్మ‌,ను "ఇంకోసారి ఇంకోసారి` అంటోన్న నాని