Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూట్‌కేసుపై బిడ్డను పడుకోబెట్టి.. దాన్ని లాగుకుంటూ... 800 కిమీ నడక!!

Webdunia
గురువారం, 14 మే 2020 (20:21 IST)
లాక్డౌన్ కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. ఎనిమిది నెలల గర్భిణితో పాటు.. ఓ చంటి బిడ్డను తోపుడు బల్లపై ఓ భర్త ఏకంగా 700 కిలోమీటర్ల మేరకు నడక మార్గంలో నడిచి సొంతూరికి చేరుకున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇపుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సూట్‌కేసుపై బిడ్డను పడుకోబెట్టి దాన్ని లాగుకుంటూ ఓ మహిళ 800 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ సొంతూరుకు చేరిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యం ఆగ్రా సమీపంలోని ఓ రహదారిపై కనిపించింది. 
 
కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం లాక్డౌన్‌లో ఉన్న విషయం తెల్సిందే. దీంతో పొట్టకూటి కోసం పట్టణాలకు వలసొచ్చిన కార్మికులు.. తమ సొంతూర్లకు వెళ్లేందుకు ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు. ఇలాంటి వాటిలో కొన్ని సంఘటనలు గుండెల్ని పిండేస్తున్నాయి.. మనసును కలిచివేస్తున్నాయి. 
 
నిప్పులు కక్కే ఎండలో.. తమ బిడ్డలను భుజాలకు వేసుకుని, కాళ్లకు పని చెబుతున్న కార్మికుల కష్టాలు వర్ణాణతీతం. నెత్తిన సంచి.. భుజంపై బిడ్డ.. చేతుల్లో మరిన్ని బ్యాగులను పట్టుకుని కార్మికులు నడక సాగిస్తున్న దృశ్యాలను చూస్తుంటే.. హృదయం ధృవీకరించాల్సిందే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ హృదయ విదారక సంఘటన ఒకటి వెగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన ఓ మహిళ కొన్నాళ్ల క్రితం పంజాబ్‌కు వలస వెళ్లింది. లాక్డౌన్‌ కారణంగా అన్ని పనులు నిలిపివేడయంతో ఉపాధి కోల్పోయింది. దీంతో సదరు మహిళ.. తన సూట్‌కేసుపై బిడ్డను పడుకోబెట్టి.. దాన్ని లాగుకుంటూ.. 800 కిలోమీటర్ల మేర నడిచింది. 
 
సూట్‌కేసుపై బిడ్డను పడుకోబెట్టి లాగుతున్న దృశ్యాలను ఆగ్రా హైవేపై మీడియా తమ కెమెరాల్లో బంధించింది. సూట్‌కేసుతో పాటు బిడ్డను లాగిలాగి ఆ మహిళ అలసిపోయింది.. నీరసంగా ఉంది. కనీసం మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆ మహిళకు మాట రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments