Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోమాంసం యూపీలో మమ్మీ.. ఈశాన్య రాష్ట్రాల్లో యమ్మీనా..? ఏంటిది?: అసదుద్ధీన్ ప్రశ్న

యూపీలో గోమాంసం వ్యవహారంపై హైదరాబాదులో ఓవైసీ మాట్లాడుతూ.. బీజేపీ తీసుకుంటున్న గో రక్షణ నిర్ణయాలను తప్పబట్టారు. బీఫ్ విషయంలో బీజేపీది ద్వంద్వవైఖరిని ప్రదర్శిస్తుందని అసదుద్ధీన్ ఫైర్ అయ్యారు.

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (17:17 IST)
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టారు. యోగి  రాకతో గోమాంస దుకాణాలన్నీ టీషాపులుగా మారిపోయాయి. గోమాంసం విక్రయించే వ్యాపారులు ప్రస్తుతం ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు ఈ నేపథ్యంలో యూపీలో గోమాంసంలో భారతీయ జనతా పార్టీ తీరుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
యూపీలో గోమాంసం వ్యవహారంపై హైదరాబాదులో ఓవైసీ మాట్లాడుతూ.. బీజేపీ తీసుకుంటున్న గో రక్షణ నిర్ణయాలను తప్పబట్టారు. బీఫ్ విషయంలో బీజేపీది ద్వంద్వవైఖరిని ప్రదర్శిస్తుందని అసదుద్ధీన్ ఫైర్ అయ్యారు. గోమాంసాన్ని నియంత్రించాలనుకుంటే.. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధానాన్ని అమలుపరచాలని అసదుద్ధీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అలాకాకుండా యూపీలో గోవును మమ్మీగా పేర్కొంటున్న బీజేపీ నేతలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం గోవును యమ్మీ (రుచికరమైన ఆహారం)గా ఎందుకు చూస్తుందని విమర్శలు గుప్పించారు. 
 
ఇంకా ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్‌ వినియోగం ఎక్కువగా ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా అసదుద్ధీన్ గుర్తు చేశారు. క్రిస్టియన్ మెజారిటీ గల మేఘాలయ, మిజోరమ్, నాగాలాండ్ ప్రాంతాల్లో బీఫ్‌ను యమ్మీ అంటూ టేస్ట్ చేస్తున్నారని అసదుద్ధీన్ తెలిపారు. యూపీలో గోమాంసంపై బీజేపీ తీరు పబ్లిసిటీ కోసమని అసదుద్ధీన్ ఫైర్ అయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్ గురించి అలా అడగడం నాట్ కరెక్ట్.. వరలక్మి శరత్ కుమార్, అంజలి పైర్

అఖండ 2: తాండవం సెట్లో పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణ కు సన్మానం

నిర్మాణంలోకి వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ - కిరణ్ అబ్బవరం లాంచ్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments