Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ప్రోటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (15:56 IST)
మహారాష్ట్ర ప్రోటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబ్కర్ ఎంపికయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యరీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం అసెంబ్లీలో కాళిదాస్ సభాధ్యక్షుడి స్థానంలో ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు.  ఆ తర్వాత కొత్త స్పీకర్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. 
 
కాగా, బుధవారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ప్రారంభం అవుతుందని గవర్నర్ కోశ్యరీ ఉత్తర్వులు జారీ చేశారు.
 
శనివారం ఉదయం సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేసి.. మూడు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. 
 
బీజేపీకి బలం లేకుండా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారంటూ శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సుప్రీం కోర్టుకు వెళ్లాయి. దీంతో బుధవారం బలం నిరూపించుకోవాలని కోర్టు ఈ ఉదయం ఆదేశించింది. ఆ తీర్పు వచ్చిన కొద్దిసేపటికే అజిత్ పవార్ రాజీనామా చేశారు.
 
దీంతో ఎన్సీపీ బలం దూరమైనందున తమకు మెజారిటీ లేదని దేవేంద్ర ఫడ్నవిస్ కూడా రాజీనామా చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఫడ్నవిస్ గవర్నర్‌ని కలిసి రాజీనామా అందజేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments