Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రదాడిలో కాశ్మీర్ బీజేపీ నేత, భార్య మృతి.. ఖండించిన గవర్నర్

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (19:07 IST)
ఉగ్రదాడిలో కాశ్మీర్ బీజేపీ నేత, ఆయన భార్య మృతి చెందారు. సోమవారం అనంతనాగ్‌ పట్టణంలోని లాల్ చౌక్‌ వద్ద ఓ బీజేపీ సర్పంచ్​, ఆయన భార్యపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన వారిని హాస్పిటల్‌కి తరలించగా.. అక్కడ వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
 
మృతులు కుల్గాం జిల్లా భాజపా కిసాన్​ మోర్చా అధ్యక్షుడు గులామ్ రసూల్​ దార్​, ఆయన భార్య అని ఓ పోలీస్​ అధికారి చెప్పారు. కుల్గామ్ జిల్లా​ రేద్వానీకి చెందిన గులామ్ రసూల్​ దార్​.. ఆ గ్రామ సర్పంచ్​గా పని చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆయన అనంత్​నాగ్​లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సర్పంచ్​ రసూల్ దార్​, ఆయన భార్యపై ఉగ్రవాదుల దాడి ఘటనను జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ ఖండించారు. ఈ పిరికిపంద చర్యకు పాల్పడినవారికి త్వరలోనే తగిన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. మృతుల కుటుంబానికి లెఫ్టినెంట్​ గవర్నర్​ సంతాపం తెలిపారు
 
మరోవైపు, పూంచ్ సెక్టార్‌లో బీఎస్ఎఫ్ దళాలు నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. బీఎస్ఎఫ్ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. విల్ సంగద్ అటవీ ప్రాంతంలో జరిగిన గాలింపులో దొరికిన ఆయుధాల్లో ఏకే 47 రైఫిళ్లు, పిస్తోళ్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments