Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్ల నాటి రైల్ రోకో కేసులో బీజేపీ నేత గిరిరాజ్ సింగ్‌కు రిలీఫ్

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (09:58 IST)
బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్‌కు తొమ్మిదేళ్ల నాటి రైల్ రోకో కేసులో బిహార్ కోర్టు ఉపశమనం కలిగించింది. గత 2014లో రైల్ రోకో కార్యక్రమం బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. ఇందులో పాల్గొన్న వారిపై బిహార్ ముజఫర్ ‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ ముజఫర్‌పూర్ ప్రత్యేక కోర్టులో సాగింది. ఈ కేసులో తీర్పును తాజాగా వెల్లడించింది. ఇందులో బీజేపీ సీనియర్ నాయకుడు గిరిరాజ్ సింగ్‌తో సహా మరో 22 మంది నిందితులను బీహార్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 
 
ముజఫర్‌పూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, వైశాలి ఎంపీ వీణాదేవి, 2 మాజీలకు రిలీఫ్ ఇచ్చింది. సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసులో నిర్దోషులుగా విడుదలైన మంత్రులు, ఇతరులు ఉన్నారు. మార్చి 2014లో, బిహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వనందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్త "రైల్ రోకో" పేరుతో ఆందోళన చేపట్టారు. 
 
ఈ ఘటనపై సోన్‌పూర్‌లో కేసు నమోదైంది. తర్వాత కేసు సోన్‌పూర్ నుంచి ముజఫర్‌పూర్ కోర్టుకు బదిలీ చేయబడింది. ఈ మొత్తం కేసుకు సంబంధించిన సమాచారం ఇస్తూ డిఫెన్స్ న్యాయవాది అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో మొత్తం 27 మంది పేర్లు ఉన్నాయని, వారిలో 23 మంది నిందితులుగా ఉన్నారని, ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకపోవడంతో వారందరినీ నిర్దోషులుగా కోర్టు విడుదల చేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments