Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటూ వైకాపా - తెరాసల కొత్త డ్రామా!

Advertiesment
vishnu vardhan reddy
, శుక్రవారం, 9 డిశెంబరు 2022 (08:49 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటూ వైకాపా, తెరాస పార్టీలు సరికొత్త డ్రామాలకు తెరలేపాయని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే తమ ఓటు అని తెలుగు రాష్ట్రాలు రెండూ కలిసిపోతే స్వాగతిస్తామంటూ ఏపీ ప్రభుత్వ సలదాహారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాజీయ దుమారం రేపుతున్నాయి. 
 
వీటిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. వైకాపా-తెరాస రాజకీయ డ్రామా మళ్లీ మొదలైందని అన్నారు. ఏపీ తెలంగాణ విభజన కేసులు మూసివేయాలంటూ సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేశారో చెప్పాలని ఆయన వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైకాపాది ఢిల్లీలో ఒక మాట, ఆంధ్రా గల్లీలో మరొక మాట అని విమర్శించారు. 
 
ఉమ్మడి ఏపీని చేసేందుకు కృషి : సజ్జల రామకృష్ణా రెడ్డి 
నవ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన రెండు రాష్ట్రాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా మళ్లీ ఒక్కటి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఏపీలో సకల శాఖామంత్రిగా పేరుగడించిన ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 
 
రాష్ట్ర విభజన తీరుపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. వీలైతే ఏపీని మళ్లీ ఉమ్మడిగా ఉండాలన్నదే తమ పార్టీ విధానమని, రెండు రాష్ట్రాలు కలిసిపోతే తొలుత స్వాగతించేది వైకాపాయేనని సజ్జల స్పష్టం చేశారు. 
 
ఇపుడే కాదు.. ఎపుడైనా ఉమ్మడి రాష్ట్రానికే తమ ఓటు అని ఏ వేదికపై అయినా ఇదే మాట చెబుతామని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం పార్టీ వైఖరి కూడా ఇదేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
విభజనకు వ్యతిరేకంగా తమ వాదనలు బలంగా వినిపించామని, చెప్పారు. రాష్ట్ర విభజనను పునఃసమీక్షించాలని లేదా సరిదిద్దాలని కోరతామని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందని ఆయన తెలిపారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీని - తెలంగాణాను మళ్లీ ఒక్కటి చేసేందుకు కృషి : సజ్జల రామకృష్ణా రెడ్డి