Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికుడిపై దాడి ఘటన : బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (13:37 IST)
వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిపై దాడి చేసిన ఘటనలో సొంత పార్టీ ఎమ్మెల్యేకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసును జారీచేసింది. ఈ దాడి ఘటనపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బబినా నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా రాజీవ్ సింగ్ పారిఛా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ రైలులో ఒక ప్రయాణికుడిపై దాడిచేసి చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ అధిష్టానం తీవ్రంగా స్పందిస్తూ ఎమ్మెల్యే షోకాజ్ నోటీసు జారీచేసింది. 
 
ఈ నెల 19వ తేదీన పారిఛా కుటుంబంతో కలిసి ఢిల్లీ నుంచి భోపాల్‌కు వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. సీటు మార్చుకునేందుకు ప్రయాణికుడు నిరాకరించడంతో ఎమ్మెల్యే అనుచరులు ప్రయాణికుడుపై దాడి చేశారు. రాజీవ్ సింగ్ సమక్షంలోనే జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అయింది. 
 
ఎమ్మెల్యే అనుచరుల దాడిలో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ముక్కు నుంచి రక్తం కారింది. ప్రయాణికుడిపై ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేస్తూ ఎమ్మెల్యే చూస్తూ నిల్చున్నారు తప్పితే వారించకపోవడ గమనార్హ. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
 
ఈ వీడియో వైరల్ కావడంతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా.. ఎమ్మెల్యే పారిఛాకు షాకాజ్ నోటీసు పంపారు. ఏడు రోజుల్లోగా విరణ ఇవ్వాలని ఆదేశించారు. మీ చర్యలు పార్టీ ప్రతిష్టలు దెబ్బతీశాయి. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యాన్ని సూచిస్తున్నాయి. ఏడు రోజుల్లోగా స్పందించాలి. లేకపోతో కఠిన చర్యలు తీసుకుంటాం అని నోటీసుల్లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments