Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరు విద్యార్థుల ఖాతాలో రూ.960 కోట్లు.. ఎగిరిగంతేశారు.. అంతే..?

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (19:17 IST)
బీహార్‌లో ఓ అరుదైన ఘటన తెర మీదకు వచ్చింది. ఇద్దరు విద్యార్థుల బ్యాంక్‌ అకౌంట్‌లో.. ఏకంగా రూ. 960 కోట్ల రూపాయలు జమయ్యాయి. అంతే ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు షాకయ్యారు. అంతే కాదు.. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు.. ఒక్కసారిగా ఎగిరిగంతేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. కటిహార్‌ జిల్లాలోని బౌరా పంచాయితీ పరిధిలోని పస్తియా గ్రామానికి చెందిన ఆశిష్‌, విశ్వాస్‌ అనే ఇద్దరు విద్యార్థులకు బిహార్‌ గ్రామీణ్‌ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. వీరి పాఠశాల యూనిఫామ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు తమ ఖాతాలో జమ అయ్యిందో లేదో అని తెలుసుకునేందుకు తమ తల్లిదండ్రులతో కలిసి ఊరిలోని ఇంటర్నెట్‌ వద్దకు వెళ్లారు. వీరి అకౌంట్‌ నెంబర్‌ను సంబంధిత బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో టైప్‌ చేసి చూసి, ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.
 
ఆరో తరగతి చదివే ఆశిత్ కుమార్ ఖాతాలో రూ.900 కోట్లు.. గురు చరణ్‌ విశ్వాస్​ ఖాతాలో రూ.60 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఈ సంఘటనపై బ్యాంక్‌ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. 
 
డబ్బుల విషయం తెలిసి బ్యాంక్‌ మేనేజర్​ మనోజ్​ గుప్తా షాకయ్యారు గురయ్యారు. ఇద్దరు అబ్బాయిల బ్యాంక్ అకౌంట్లలో భారీ మొత్తాన్ని గుర్తించినట్లు తమకు సమాచారం అందిందని దానిని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే టెక్నికల్‌ ఇష్యూ వల్లే ఇదంత జరిగిందని మనోజ్‌ గుప్పా చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments