Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో నిర్భయ తరహా ఘటన.. మైనర్ బాలికపై ఆరుగురు గ్యాంగ్‌రేప్.. రైలు నుంచి తోసేశారు..

ఢిల్లీ తరహా నిర్భయ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. నిర్భయలాంటి యువతులు కామాంధులకు బలైనా కఠినమైన చట్టాలు లేకపోవడంతో చిన్నాపెద్దా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మైనర్ బాలికపై బీహ

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (17:26 IST)
ఢిల్లీ తరహా నిర్భయ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. నిర్భయలాంటి యువతులు కామాంధులకు బలైనా కఠినమైన చట్టాలు లేకపోవడంతో చిన్నాపెద్దా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మైనర్ బాలికపై బీహార్ రైలులో సామూహిక అత్యాచారం జరిగింది. ఆపై ఆ బాలికను కామాంధులు రైలు నుంచి తోసేశారు. 
 
శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బీహార్ లఖిసరాయ్ జిల్లాలోని లఖోచాక్ గ్రామంలో నివాసం ఉంటున్న 14ఏళ్ల బాలికను నిందితులు అపహరించుకుపోయారు. పొలాల్లో ఆరుగురు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో అపస్మారక స్థితికి వెళ్ళిపోయిన ఆ మైనర్ బాలిక.. కళ్లు తెరిచి చూసే సరికి రైలులో ఉంది. 
 
కదులుతున్న రైలులో తన ఇంటి పొరుగున ఉండే ఇద్దరు బాలురు తనను రైలు నుంచి కిందకు తోసేశారని బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు తెలిపింది. ఒళ్లంతా గాయాలతో కిలు రైల్వే స్టేషన్ సమీపంలో పడి ఉన్న బాలికను గుర్తించి పాట్నా మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తీవ్ర రక్తస్రావంతో పాటు, ఐదు చోట్ల పెల్విక్ బోన్ ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments