Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్ ఆ అమ్మాయిని అటు తీసుకెళ్లబోయాడు.... దూకేసింది...

ఈమధ్య కాలంలో అమ్మాయిలపై హింసాత్మక ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరులో మరో ఘటన చోటుచేసుకుంది. బీటెక్ చదవుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థినిని ఓ ఫైనల్ ఇయర్ విద్యార్థి లోకేష్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆమె సాహసం చేయడంతో

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (16:09 IST)
ఈమధ్య కాలంలో అమ్మాయిలపై హింసాత్మక ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరులో మరో ఘటన చోటుచేసుకుంది. బీటెక్ చదవుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థినిని ఓ ఫైనల్ ఇయర్ విద్యార్థి లోకేష్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆమె సాహసం చేయడంతో ముప్పు తప్పింది. 
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు లోని సంగడిగుంట రెడ్లబజారుకు చెందిన విద్యార్థినిని చేబ్రోలులో ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా తను చదివే కాలేజీకి చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థి లోకేష్ బైకుపై ఆమె వద్దకు వచ్చాడు. ఆమెను చూస్తూనే బైకు ఎక్కు అంటూ బెదిరించాడు. అతడి బెదిరింపులకు జడుసుకున్న విద్యార్థిని బైకుపై ఎక్కి కూర్చుంది. 
 
అతడు ఆమెను ఎక్కించుకుని నారాకోడూరు వరకూ వచ్చాడు. అక్కడి సెంటరుకు రాగానే విద్యార్థిని ధైర్యం చేసి అతడి బైకు పైనుంచి కిందికి దూకేసింది. ఆమె అలా దూకేయడాన్ని చూసిన స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లారు. దీంతో లోకేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. విద్యార్థిని తల్లిదండ్రులు అతడిది పెదనందిపాడు అని తెలిసి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడివారి వీరిని బెదిరించారు. ఐనా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments