Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ప్రజలు చనిపోతున్నారు.. 24 గంటల్లో 42 మంది జలసమాధి

బీహార్ రాష్ట్రంలో వర్ష, వరద బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 42 మంది చనిపోయారు. దీంతో బీహార్‌లో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 482కు చేరింది. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా వ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (21:01 IST)
బీహార్ రాష్ట్రంలో వర్ష, వరద బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 42 మంది చనిపోయారు. దీంతో బీహార్‌లో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 482కు చేరింది. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా వరద మృతుల సంఖ్య 101కు చేరింది. 
 
కాగా, గత కొన్ని రోజులుగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ రాష్ట్రంలోని 19 జిల్లాల పరిధిలోని 1.72 కోట్ల మంది ఇంకా వరదముంపులోనే ఉన్నారు. జాతీయ విపత్తు నివారణ సంస్థకు చెందిన 28 బృందాలు, 630 మంది సైనికులు వివిధ బృందాలుగా విడిపోయి పునరావాస, సహాయక చర్యలు చేపడుతున్నా...  బాధితులను పూర్తి స్థాయిలో సురక్షిత ప్రాంతాలకు తరలించలేక పోతున్నారు. 
 
బీహార్‌లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీటిముంపులోనే ఉన్నా.. వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. యూపీలో గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 101కి చేరింది. వేలాది గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments