బీహార్ రిజల్ట్స్ : నిమిషాల వ్యవధిలో పుంజుకున్న బీజేపీ.. ఎన్డీయేదే గెలుపు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (11:59 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిమిషాల వ్యవధిలో తారుమారయ్యాయి. మంగళవారం ఉదయం చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఆర్జేడీ - కాంగ్రెస్ సారథ్యంలోని మహా కూటమి పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. అయితే, బీజేపీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ ఆధిక్యాన్ని తుడిసిపెట్టేసింది. ఫలితంగా ఆధిక్యపు బలాబలాలు తారుమారయ్యాయి. 
 
ఉదయం 10 గంటల వరకూ స్పష్టమైన ఆధిక్యంలో ఉండి, సాధారణ మెజారిటీకి అవసరమైనన్ని స్థానాల్లో ఆధిక్యంలో కనిపించిన మహా ఘటబంధన్, ఆపై అనూహ్యంగా వెనక్కు పడిపోయింది. ఎన్డీయే మెజారిటీ నంబర్ 125తో పోలిస్తే 8 అధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీయే ప్రస్తుతం 130 చోట్ల ఆధిక్యంలో ఉండగా, మహా ఘటబంధన్ 109 చోట్ల ఆధిక్యంలో ఉంది. కింగ్ మేకర్‌గా మారతారని భావించిన చిరాగ్ నేతృత్వంలోని ఎల్జేపీ 4 స్థానాలకు, ఇతరులు 8 స్థానాలకు పరిమితం అయ్యారు.
 
ఇక, బీహార్ లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుంది. దాదాపు 70 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఆ తర్వాత ఆర్జేడీ అభ్యర్థులు 50 స్థానాల వరకూ, జేడీయూ 35 స్థానాల వరకూ, కాంగ్రెస్ 20 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు గంటల్లో బీహార్ ఫలితాలపై పూర్తి స్పష్టత వెలువడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments