Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ సీఎం ఇంట్లో దెయ్యాలు.. వదిలివెళ్లిన మాజీ సీఎం లాలూ

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (13:54 IST)
బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇపుడు ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. అదేంటంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ నివాసంలో దెయ్యాలు తిరుగుతున్నాయట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా వెల్లడించారు. పైగా, ఈ దెయ్యాలను వదిలి వెళ్లింది కూడా ఎవరో కాదట. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అని ఆయన సెలవిచ్చారు. ఇంతకీ నితీశ్ కమార్ అలా వ్యాఖ్యానించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. 
 
కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రాజధాని పాట్నాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన భవనం విశాలంగా ఉండేదని, ఇంటి వెనుక భాగంలో మట్టికుప్పలు, ఇంటి నలుమూలల్లో కాగితపు కవర్లు కనిపించాయని, తన కోసం కొన్ని దెయ్యాలను ఆ ఇంట్లో వదిలేసి వెళ్లానని లాలూ స్వయంగానే తనతో అన్నారని నితీశ్ వ్యాఖ్యానించారు. 
 
లాలూ తనదైన స్టయిల్‌లో ఈ మాటలు అనివుండవచ్చని నితీశ్ చెప్పినా, ఆయన మాటలు మాత్రం ఇప్పుడు బీహార్‌లో చర్చనీయాంశమయ్యాయి. గతంలో లాలూకు నష్టం కలిగించాలన్న ఉద్దేశంతో కాళీమాత ఆలయంలో నితీశ్ ప్రత్యేక పూజలు చేయించారని, ఈ విషయాన్ని తాంత్రికుల నుంచి తెలుసుకున్న లాలూ, పూజల ప్రభావం తనపై పడకుండా చూసుకునేందుకు ప్రత్యేక పూజలు చేశారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments