Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళి కట్టే వేళ తాగితూలాడు... వధువు ఏం చేసిందో తెలుసా?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (10:49 IST)
మరికొన్ని క్షణాల్లో పెళ్లి.. ఇంతలో వరుడు పీకల వరకు మద్యం సేవించి పెళ్లి మండపానికి వచ్చాడు. కానీ, తాళి కట్టే సమయంలో తూలాడు. అంతే.. వధువు పసిగట్టేసింది. వరుడు మద్యం సేవించివున్నాడని తెలుసుకుని, మెడలో మూడుముళ్లు వేయించుకునేందుకు ససేమిరా అంది. అంతే పీటలపై పెళ్లి ఆగిపోయింది. 
 
ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని దుమారిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దుమ్రి గ్రామానికి చెందిన ఓ యువతికి అదే గ్రామానికి చెందిన ఓ బబ్లూ కుమార్ అనే యువకుడుకిచ్చి పెళ్లి చేయాలని ఇరు వర్గాల పెద్దలు నిర్ణయించారు. దీంతో వీరి పెళ్లి శనివారం జరగాల్సివుంది. 
 
ఈ క్రమంలో పెళ్లి కార్యక్రమం సజావుగా సాగుతున్న వేళ పెళ్లి కుమారుడు ముహుర్తానికి ముందు మద్యం సేవించి పెళ్లి పీటలెక్కాడు. అంతే... వరుడు విపరీతంగా మద్యం సేవించడంతో తూలుతుండటాన్ని వధువు కనిపెట్టింది. అంతే.. ఈ పెళ్లి తనకొద్దంటూ మొండికేసింది. వేదిక నుంచి దిగివెళ్లిపోయింది. 
 
ఇరు కుటుంబాల పెద్దలు వధువు రింకీ కుమారికి నచ్చజెప్పినా ఆమె వివాహానికి సుముఖత చూపలేదు. రింకీ తల్లితండ్రుల నుంచి పెళ్లికుమారుడి కుటుంబం తీసుకున్న కట్నం సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ గ్రామస్తులు పట్టుబట్టారు. ఈ వ్యవహారంపై వధువు తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments