Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపాలి.. రెండు రోజులు లీవు కావాలి...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (13:15 IST)
బీహార్‌లో భార్యను చంపేందుకు రెండు రోజులు సెలవు కావాలని బ్యాంకు మేనేజర్ రాసిన ఉత్తరం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌, బక్సర్‌కు చెందిన మున్నా ప్రసాద్ ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇతని భార్య ఆస్పత్రితో చికిత్స పొందుతోంది. భార్యను పక్కనుండి చూసుకోలేక అప్పుడప్పుడు సెలవులు పెట్టేవాడు మున్నా ప్రసాద్. 
 
అయితే మున్నా ప్రసాద్‌కు సెలవులిచ్చేందుకు పై అధికారులు అనుమతి ఇచ్చేవారు కాదు. దీంతో మనస్తాపానికి గురైన మున్నా తన భార్యను చంపేయాలని.. ఆమె అంత్యక్రియలకు చేసేందుకు రెండు రోజులు సెలవు కావాలని పై అధికారులకు ఓ లేఖ రాశాడు. ఈ లేఖను ప్రధాని కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయాలకు కూడా పంపాడు. దీంతో జడుసుకున్న అధికారులు ఎన్ని రోజులైనా సెలవు తీసుకోవచ్చునని చెప్పేశారు. 
 
ఈ నేపథ్యంలో తన లేఖపై వివరణ ఇచ్చిన మున్నా.. తన భార్యను పక్కనుండి చూసుకోలేకపోతున్నానని.. అందుకే సెలవు కావాలని అడిగాను. సెలవులు ఇవ్వకపోవడంతో విరక్తిలో ఈ లేఖను రాయాల్సి వచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments