Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి ఇంట్లో అడ్డంగా దొరికిన ప్రియుడు... ప్రైవేట్ పార్ట్స్ కత్తిరింపు

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (13:38 IST)
బీహార్‌లో దారుణం జరిగింది. తన ప్రియురాలి ఇంట్లో పట్టుబడిన ఓ యువకుడి మర్మాంగాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు కోసిపారేశారు. దీంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో రేపూర రాంపురుష్ గ్రామంకు చెందిన 17 ఏళ్ల సౌరభ్ కుమార్ పక్కనే ఉన్న సోర్బారా అనే గ్రామంకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఈ అమ్మాయి కూడా సౌరబ్‌ను ప్రేమించింది. అయితే అమ్మాయి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సౌరభ్ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చారు. 
 
ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు సౌరభ్‌ను ఆ అమ్మాయిని కలిసి ఉండటం చూసి ఎక్కడ లేని కోపం తెచ్చుకున్నారు. ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు సౌరభ్‌ను వెంటాడి పట్టుకుని చితకబాదారు. వదిలేయాలంటూ ఎంత ప్రాధేయపడినా జాలి చూపని ఆ కుటుంబ సభ్యులు సౌరభ్ మర్మాంగంను కోసేశారు. 
 
తీవ్ర రక్తస్రావంతో ఉన్న సౌరభ్‌ను స్థానికులు తీసుకెళ్లి హాస్పిటల్‌లో చేర్చి అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్స పొందుతూ అదే రోజు సౌరభ్ ప్రాణాలు విడిచాడు. సౌరభ్‌ను కొట్టి చంపిన వారిలో సుశాంత్ పాండే అనే వ్యక్తిని గుర్తించిన కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేశారు. 
 
అంతేకాదు అమ్మాయి ఇంటి ముందే సౌరభ్ దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సౌరభ్ హత్యకేసులో మరికొందరు నిందితులు తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments