Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం.. కిరోసిన్ పోసి నిప్పంటించారు

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (13:35 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బీహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌కు చెందిన ఓ కుటుంబం మోతిహరీ గ్రామంలో నివాసముంటోంది. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. 
 
అది గమనించిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు విగతజీవిగా పడిఉన్న బాలికను ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది.
 
బాలిక చనిపోయిందని తెలుసుకున్న నిందితులు.. మృతదేహాన్ని వెంటనే దహనం చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించి.. బాలిక మృతదేహాన్ని కిరోసిన్ పోసి నిప్పంటించారు. అనంతరం సాక్ష్యాధారాలు లభించకుండా చుట్టూ ఉప్పును చల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే బాధితురాలి తండ్రి హత్యాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని 11 మంది నిందితులను గుర్తించి.. వీరిలో నలుగురిపై సామూహిక అత్యాచార అభియోగం మోపారు. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశామని.. మిగిలిన వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments