Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంచు కొస్తున్న భారీ సౌర తుఫాను ముప్పు..

ఠాగూర్
ఆదివారం, 6 అక్టోబరు 2024 (11:28 IST)
భూమికి సౌర తుఫాను ముప్పు పొంచివుంది. ఈ భారీ సౌర తుఫాను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లపై ప్రభావం చూపుతుందని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను భూమి వైపు దూసుకొస్తున్నందున రానున్న కొన్ని రోజులు కీలకమని పేర్కొన్నారు.
 
కాగా సూర్యుడి ఉపరితలంపై అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఏర్పడే కణాలు, అయస్కాంత క్షేత్రాలు, ఇతర పదార్థాలు వచ్చి భూమి వాతావరణాన్ని తాకుతాయి. ఈ దృగ్విషయాన్నే సౌర తుఫానుగా పేర్కొంటారు. రాబోయే సౌర తుఫాను టెలికమ్యూనికేషన్లతో పాటు శాటిలైట్‌కు కూడా అంతరాయం కలిగించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సౌర తుపానును భారత శాస్త్రవేత్తలు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. తగిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ భారత ఉపగ్రహ ఆపరేటర్లను ఇస్రో నిపుణులు ఇప్పటికే అప్రమత్తం చేశారు.
 
ఈ సౌర తుఫాను భారత్‌పై ఏవిధంగా ప్రభావం చూపుతుందనే అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ డాక్టర్ అన్నపూర్ణి సుబ్రమణియన్ మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం సూర్యుడిపై సంభవించిన జ్వలనాలు.. ఈ ఏడాది మే నెలలో సంభవించిన జ్వలనాలతో సమానమని చెప్పారు. 
 
ఈ సౌర తుఫాను భూమిని తాకడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని తెలిపారు. ఇక భారత్‌పై ఈ తుఫాను ప్రభావం ఉండొచ్చు, ఉండకపోవచ్చని అన్నారు. వేచి చూడాల్సి ఉంటుందని డాక్టర్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది మే నెలలో బలమైన సౌర తుఫాను భూమిని తాకిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments