చెన్నై ఎయిర్ షో కోసం ముస్తాబైంది. ఈ షో ఆదివారం జరుగనుంది. గ్రేటర్ చెన్నై 6,500 మంది పోలీసులు, 1,500 మంది హోంగార్డులను ఈ షో భద్రత కోసం మోహరించడం జరిగింది.
న్యూఢిల్లీకి తర్వాత దక్షిణ భారతదేశంలో జరిగే ఈ తొలి ఎయిర్ షోకు దాదాపు 15 లక్షల మంది హాజరవుతారని ఐఏఎఫ్ ప్రకటనలో తెలిపింది.
92వ వైమానిక దళ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎయిర్ షో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో తాంబరం, తంజావూరు, సూలూరులోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లు, బెంగళూరులోని ట్రైనింగ్ కమాండ్ బేస్ నుండి 20కి పైగా వివిధ రకాల విమానాలను ప్రదర్శించనున్నారు. పాల్గొనే ప్రతి బృందం ఈస్ట్ కోస్ట్ రోడ్ పైన కలుస్తుంది. తరువాత మెరీనా బీచ్‌కు చేరుకుంటుంది.