Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సౌకర్యవంతమైన పన్ను చెల్లింపుల కోసం జీఎస్టీ పోర్టల్‌లో ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్

gstlogo

ఐవీఆర్

, శనివారం, 5 అక్టోబరు 2024 (17:36 IST)
ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ సౌకర్యవంతమైన జీఎస్టీ చెల్లింపులను సాధ్యం చేస్తూ, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) పోర్టల్‌తో తన ఏకీకరణను ప్రకటించింది. తక్షణ చెల్లింపు నిర్ధారణలు మరియు డౌన్‌లోడ్ చేయదగిన చలాన్‌లను సులభంగా పొందే అవకాశంతో వినియోగదారులు ఇప్పుడు స్పష్టమైన, సౌకర్యవంతమైన చెల్లింపు అనుభవం నుండి ప్రయోజనం పొందుతారు.
 
 ఈ కొత్త ఏకీకరణతో ఐడిఎఫ్‌‌సి ఫస్ట్ బ్యాంక్ కస్టమర్‌లు బ్యాంక్ యొక్క వినియోగదారు-స్నేహపూర్వక రిటైల్, కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, దాని దేశవ్యాప్త బ్రాంచ్ నెట్‌వర్క్‌తో సహా వివిధ డిజిటల్ ఛానెల్‌ల ద్వారా జీఎస్టీ ని చెల్లించవచ్చు. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ రిటైల్ లయబిలిటీస్, బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ శ్రీ చిన్మయ్ ధోబ్లే ఇలా మాట్లాడుతూ, “కస్టమర్-ఫస్ట్ బ్యాంక్‌గా, మేము మా కస్టమర్‌లకు సౌకర్యవంతమైన, ఉపయోగించడానికి సులభమైన పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము.
 
జీఎస్టీ పోర్టల్‌తో ఈ ఏకీకరణ సార్వత్రిక బ్యాంకింగ్ పరిష్కారాలను అందించాలనే మా లక్ష్యంలో మరో కీలకమైన ముందడుగు. త్వరిత, సరళమైన మరియు సమర్థవంతమైన పన్ను చెల్లింపు అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం. ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ యొక్క ఆన్‌లైన్, బ్రాంచ్‌ల ద్వారా వారి జీఎస్టీని సులభంగా చెల్లించడానికి ఈ సౌకర్యాన్ని ఉపయోగించమని మేము మా కస్టమర్‌లను ప్రోత్సహిస్తున్నాము.." అని అన్నారు. 
 
జీఎస్టీ వసూళ్ల కోసం ధృవీకరించబడిన, ఎంపిక చేయబడిన షెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌లలో ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి, దాని ఖాతాదారులకు సమగ్ర ఆర్థిక సేవలను అందించడంలో బ్యాంక్ యొక్క నిబద్ధతను మరింతగా ఇది  నొక్కి చెబుతుంది.
 
ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి జీఎస్టీ చెల్లించడానికి ఏమి చేయాలంటే :
 
1.    జీఎస్టీ పోర్టల్‌ services.gst.gov.in/services/login కి లాగిన్ చేయండి
2.    చలాన్‌ని సృష్టించండి మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా E-చెల్లింపును ఎంచుకోండి
3.    చెల్లింపు ఎంపికగా ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్‌ని ఎంచుకోండి
4.    చెల్లింపును పూర్తి చేసి, జీఎస్టీ  చెల్లించిన చలాన్‌ని డౌన్‌లోడ్ చేయండి
 
అదనంగా, యుపిఐ  మరియు కార్డ్ చెల్లింపులతో సహా మరిన్ని చెల్లింపు ఎంపికలను పరిచయం చేయడానికి ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ , జీఎస్టీ   అధికారులతో కలిసి పని చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య