Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

పెట్రోల్ - డీజిల్ ధరల తగ్గింపు మా చేతుల్లో లేదు.. రాష్ట్రాలన్నీ కలిసి రావాలి : విత్తమంత్రి నిర్మలమ్మ

Advertiesment
petrol

సెల్వి

, శనివారం, 27 జులై 2024 (11:31 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేలా చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఇందుకోసం వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారు సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి చేర్చడం వల్ల ఆదాయం కోల్పోతామన రాష్ట్రాలు వెనుకంజ వేస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. అదేసమయంలో ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఏ ఒక్క రాష్ట్రాన్ని విస్మరించలేదని చెప్పారు. 
 
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు అంశంపై ఆమె స్పందిస్తూ, ప్రస్తుతం ఇంధనం వస్తు సేవల పన్ను కింద ఉంది. అయితే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు కలిసి వస్తే జీఎస్టీ కిందకు వస్తుందని, అప్పుడు వాటి ధరలు తగ్గుతాయన్నారు. రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందన్నారు.
 
ధరను నిర్ణయించి, అందరూ కలిసి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చాలని నిర్ణయించుకుంటే తాము దానిని వెంటనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలో చేర్చేందుకు అవసరమైన నిబంధనలను ఇప్పటికే రూపొందించామన్నారు. జీఎస్టీ కౌన్సిల్ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రాలు ఆదాయం కోల్పోయే పరిస్థితులు ఉంటాయని, అందుకే రాష్ట్రాలు ఇందుకు సుముఖత చూపడం లేదన్నారు. 
 
ఇకపోతే, కేంద్ర బడ్జెట్లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగలేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. బీజేపీ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్‌లను మాత్రమే బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారని విపక్షాల విమర్శలను ఆమె తోసిపుచ్చారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో ఏపీకి విభజన చట్టం ప్రకారం సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మాదిరే రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని, ఏ ఒక్క రాష్ట్రానికీ నిధులను నిరాకరించలేదన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణంతో పాటు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం చేయాల్సి ఉందని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరాచీలో దారుణం.. విడాకులు కోరిందనీ కుమార్తె కాళ్లు నరికేసిన కసాయి తండ్రి!