Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో బాలికకు 9సార్లు అబార్షన్.. పదోసారి బిడ్డకు జన్మనిచ్చింది.. ఎక్కడ?

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (15:04 IST)
ప్రేమ పేరుతో బాలికను మోసం చేశాడో కామాంధుడు. ప్రేమిస్తున్నానని చెప్పి బాలికపై పదేళ్ల పాటు లైంగికంగా దాడి చేశాడు. చివరకు ఆ నిందితుడికి కర్ణాటకలోని బీదర్ జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఐదువేల రూపాయల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. ఓ బాలికపై పదేళ్ల పాటు ప్రేమిస్తున్నానని మారుతి అనే కామాంధుడు మోసం చేశాడు.
 
ఈ లైంగిక దాడుల కారణంగా తొమ్మిది సార్లు ఆమె గర్భవతి అయ్యింది. కానీ మారుతి ప్రతిసారీ అబార్షన్ చేయించాడు. అయితే పదోసారి ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టడం ఇష్టంలేదని మారుతి ఆ బిడ్డను అనాథ శరణాలయానికి ఇచ్చేశాడు. దీంతో బాధితురాలు ఔరద్‌లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీనిపై విచారణ జరపిన బీదర్ జిల్లా సెషన్స్ కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు నిందితుడి ఆస్తులను స్వాధీనం చేసుకుంది. బాధితురాలికి రూ.5లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా జిల్లా యంత్రాగాన్ని ఆదేశించింది.
 
2002లో స్కూల్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్డీఎమ్సీ) ప్రెసిడెంట్‍‌గా పనిచేసిన మారుతి (40) 14 ఏళ్ల అమ్మాయిని ట్రాప్‌లో పెట్టాడు. ఆమెను ప్రేమ పేరుతో మోసం చేశాడు. 34 ఏళ్ల వ్యక్తి తమ కుమార్తెను వివాహం చేసుకుంటానని చెప్పడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. పెళ్ళికి తర్వాత చదివిస్తానని నమ్మపలికాడు. ఇందుకు బాలిక కూడా సమ్మతించడంతో మారుతి ఇంట్లోనే వివాహం జరిగింది. 
 
పెళ్ళయ్యాక 9 సార్లు ప్రెగ్నెంట్ అయిన అమ్మాయికి అబార్షన్ చేయించాడు. కానీ పదోసారి ప్రెగ్నెంట్ అయిన ఆ అమ్మాయి ఏలాగో ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను కూడా మారుతి శరణాలయానికి ఇచ్చేయడంతో ఇక లాభం లేదనుకుని పుట్టింటికి వచ్చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం