Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ భార్యకు అతడితో ఉన్న లింకు నాకు ముందే తెలుసు... చెప్పిన తల్లి... చంపేసిన కొడుకు

అక్రమ సంబంధాల వల్ల తలెత్తే అనర్థాలు అన్నీఇన్నీ కావు. హత్యలు, విడాకులు వంటి వాటితో కాపురం అతలాకుతలం అవుతుంది. కొన్నిచోట్ల ఈ సంబంధాలు హత్యలకు దారి తీస్తాయి. ఇలాంటిదే తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులోని ఆర్కాడు తాలూకాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (14:34 IST)
అక్రమ సంబంధాల వల్ల తలెత్తే అనర్థాలు అన్నీఇన్నీ కావు. హత్యలు, విడాకులు వంటి వాటితో కాపురం అతలాకుతలం అవుతుంది. కొన్నిచోట్ల ఈ సంబంధాలు హత్యలకు దారి తీస్తాయి. ఇలాంటిదే తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులోని ఆర్కాడు తాలూకాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఆర్కాడు తాలుకా తామరపాక్కం గ్రామానికి చెందిన 53 ఏళ్ల మహిళ అయిన పూంగావనం కుమారుడు రమేష్. కూలీ కార్మికుడుగా బతుకు వెళ్లదీస్తున్న ఇతను ప్రియ అనే యువతిని పెళ్లాడాడు. 
 
ఐతే ప్రియ అదే గ్రామానికి చెందిన ట్రాక్టరు డ్రైవరుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఘర్షణ మరింత ఎక్కువ కావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. రోజులు గడిచినా భార్య తిరిగి రాకపోవడంతో ఆమెను తిరిగి తీసుకురావాలని శుక్రవారం నాడు తన తల్లిని కోరాడు రమేష్. ఐతే కోడలు ప్రియకు-ట్రాక్టర్ డ్రైవరుతో ఉన్న సంబంధం తనకు ముందే తెలుసుననీ, ఈ విషయం చెబితే ఏం జరుగుతుందోనని చెప్పలేదని ఆమె వెల్లడించింది. 
 
దీనితో కోపంతో ఊగిపోయిన కొడుకు తనకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదంటూ కత్తి తీసుకుని తల్లిని విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తిరువణ్ణామలైలో ఉన్న తన భార్యను కూడా హతమార్చాలని బయలుదేరాడు. ఐతే ఈలోపుగా స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments